శ్రీ చోళమాంబ దేవి చరిత్ర
రాజరాజ చోళ ధర్మ మరియు ధార్మిక పరిపాలనా కాలంలో తన రాజ్యాధికారం ఉన్న ప్రతి ప్రాంతంలో ఎన్నో ఆలయాలు నిర్మిస్తూ భక్తి కార్యాలను జరిపేవారు. శ్రీ చాముండేశ్వరీ దేవి భక్తుడైన రాజరాజ చోళుడు తన పరిపాలనా భాగమైన నిడగళ్లు సంస్థానంలో శ్రీ చోళమాంబ దేవాలయం నిర్మించబడింది.
అదే విధంగా ప్రతి మండలాధిపతిని వారి వారి విభాగంలో దేవాలయాలను నిర్మింపచేశారు. నిడగళ్లు దేవస్థానం దాదాపు 11 – 12 దశాబ్దంలో నిర్మించిందని చెబుతారు.
రాజరాజ చోళ ధర్మ మరియు ధార్మిక పరిపాలనా కాలంలో తన రాజ్యాధికారం ఉన్న ప్రతి ప్రాంతంలో ఎన్నో ఆలయాలు నిర్మిస్తూ భక్తి కార్యాలను జరిపేవారు. శ్రీ చాముండేశ్వరీ దేవి భక్తుడైన రాజరాజ చోళుడు తన పరిపాలనా భాగమైన నిడగళ్లు సంస్థానంలో శ్రీ చోళమాంబ దేవాలయం నిర్మించబడింది. అదే విధంగా ప్రతి మండలాధిపతిని వారి వారి విభాగంలో దేవాలయాలను నిర్మింపచేశారు. నిడగళ్లు దేవస్థానం దాదాపు 11 – 12 దశాబ్దంలో నిర్మించిందని చెబుతారు.
రాజరాజ చోళ పరిపాలన అనంతరం తన మనుమడైన రాజరాజ చోళ III పరిపాలనలో విద్రోహుల దండయాత్రలో భాగంగా దేవాలయాల నిర్వీర్యం సమయంలో నిడగల్లు దేవాలయం మీద దాడి చేసినపుడు ఒక వీరుడు నిడగల్లు దేవీ మూర్తిని ఒక పెట్టెలో పెట్టుకొని ఎవరికీ కనబడకుండా దేవతా మూర్తిని కాపాడే సమయంలో ఒక విద్రోహుడు బాగా రక్తం కారేలా గాయ పరిచాడు. అపుడు రక్తం కారుతూ ఎలాగైనా దేవతా మూర్తిని విద్రోహుల కంట పడకుండా కాపాడాలనే కృషితో అలాగే చాలా దూరం ప్రయాణించాడు. తనకు బలం ప్రసాదించమని దేవతని కోరగా తల్లి అతనికి బలం ఇచ్చి తన మూల విగ్రహ బరువును తేలిక చేసింది.
వీరుడు అమరసింహపురం, ఇప్పటి అమరాపురం చేరుకున్నాక పెట్టెలో ఏమాత్రం బరువు లేకపోవడంతో తల్లి లేదేమో అని బయపడి పెట్టెను తెరిచి చూసాడు. అపుడు శ్రీ చోళమాంబ అతనికి ప్రత్యక్షమై ఇపుడు తనకు దర్శనమిచ్చిన చోటు చాలా పవిత్రమని ఇక్కడే తను వెలసి పూజలందుకొంటా అని చెప్పడంతో, ఎన్నో సంవత్సరాలు వీరుడు ఆమెను చిన్న ఇంటిలో పూజిస్తూ జీవనం గడపడం జరిగింది.
మొత్తం 41 గ్రామాల ప్రజలు అప్పట్లో శ్రీ చోళమాంబ దేవిని దర్శించుకొని పూజించుకొనేవారు. 1956వ సంవత్సరంలో వలస చిక్కవీరప్ప యొక్క భూదానం ద్వారా ఇక్కడ దేవస్థానం నిర్మించబడినది.
దాతలు
మా గౌరవప్రదమైన స్పాన్సర్లు
మేము ఇక్కడ గౌరవప్రదమైన స్పాన్సర్ల జాబితాను ఉంచుతాము
చోళమాంబ దేవాలయం,
అమరాపురం,
శ్రీ సత్యసాయి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
Contact Info
- +91 7816045558
- [email protected]
-
చోళమాంబ దేవాలయం, అమరాపురం,
శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్