శ్రీ శ్రీ శ్రీ
చోళమాంబ దేవి
శ్రీ సత్య సాయి జిల్లా అమరాపురం నందు వెలసిన శ్రీ చోళమాంబ దేవి ఇక్కడి ప్రజల ఇలవేల్పు. ఇక్కడి అమరాపురం, మద్దనకుంట, పుల్లికుంట, వీరాపురం మరియు బంగారుపాళ్యం ఇలా ఎన్నో గ్రామాల ప్రజలు చోళమాంబ దేవిని ప్రతి నిత్యము పూజిస్తున్నారు.
తమ ఇష్టదైవమైన చోళమాంబ ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడి ప్రజలను అత్యంత తీవ్రమైన వ్యాధులు మరియు కరువు కాటకాలనుండి కాపాడినట్లు చెబుతారు.
అమరాపురం గ్రామము మరియు చుట్టుప్రక్కల గ్రామాలలో మంచి నీటికి, తాగునీటికి కొరవలేకుండా చల్లగా కాపాడుతున్నారని ప్రజల బలమైన నమ్మకం.
శ్రీ చోళమాంబ దేవి
పండుగ మరియు పూజా విశేషాలు
శ్రీ చోళమాంబ అమ్మవారికి ప్రతిరోజూ పూజలతో పాటు మంగళవారము మరియు శుక్రవారము అమోఘమైన ప్రత్యేక పూజలు జరుగును.
శ్రావణమాసం, బాధ్రపదమాసం మరియు కార్తికమాసంలో పండుగలాగా ప్రత్యేక పూజలను నిర్వహిస్తుంటారు. కార్తీకదీపోత్సవం ఇక్కడి 5 నుంచి 10 గ్రామాల ప్రజలు జరుపుకొంటారు.
ఇక్కడి ప్రజలు అమ్మవారిని ఊరేగింపుగా వారి గ్రామానికి మరియు ఇంటికి తీసుకెళ్లి వారి శుభప్రదమైన కార్యాలు ఇంటి నిర్మాణ ప్రారంభోత్సవం లాంటి పెద్ద కార్యాలతో పాటు చిన్నపిల్లల నామకరణం లాంటి కార్యాలను కూడా అమ్మవారికి పూజతోనే ప్రారంభిస్తారు.
దసరా పండుగ సందర్భాలలో శ్రీ చోళమాంబ ఆలయంలో వివిధ అలంకరణలతో పదిరోజులపాటు ఎన్నో వైవిధ్యమైన పూజలు, దేవి అలంకరణలు మరియు ప్రాసాదాలతో ప్రజలు పండుగను జరుపుకొంటారు.
శ్రీ చోళమాంబ దేవి
చరిత్ర
రాజరాజ చోళ ధర్మ మరియు ధార్మిక పరిపాలనా కాలంలో తన రాజ్యాధికారం ఉన్న ప్రతి ప్రాంతంలో ఎన్నో ఆలయాలు నిర్మిస్తూ భక్తి కార్యాలను జరిపేవారు. శ్రీ చాముండేశ్వరీ దేవి భక్తుడైన రాజరాజ చోళుడు తన పరిపాలనా భాగమైన నిడగళ్లు సంస్థానంలో శ్రీ చోళమాంబ దేవాలయం నిర్మించబడింది.
అదే విధంగా ప్రతి మండలాధిపతిని వారి వారి విభాగంలో దేవాలయాలను నిర్మింపచేశారు. నిడగళ్లు దేవస్థానం దాదాపు 11 – 12 దశాబ్దంలో నిర్మించిందని చెబుతారు.
ఫిబ్రవరి 10 నుంచి 15 వరకు జరుగు పెద్ద జాతరకు అందరిని ఆహ్వానిస్తున్నాము.
శ్రీ చోళమాంబ దేవి
పెద్ద జాతర మహోత్సవం
అమరాపురం, మద్దనకుంట, పుల్లికుంట, వీరాపురం మరియు బంగారుపాళ్యం పెద్దలు, భక్తులు కలసి శ్రీ చోళమాంబ దేవి పెద్ద జాతర నిర్వహించాలని నిర్ణయించారు. కావున భక్తులు విచ్చేసి దేవి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము.
నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు శ్రీ చోళమాంబ దేవి మీ అందరికి గొప్ప విజయాన్ని మరియు సుసంపన్నమైన జీవితం అనుగ్రహిస్తుంది.
Dev
మీ అందరికీ శ్రీ చోళమాంబ దేవి ఆలయ పెద్ద జాతర విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. 100 సంవత్సరాల తరువాత జరిగే ఈ కార్యక్రమం గొప్ప విజయం సాధించాలని కోరుకొంటున్నాను.
Designer
చోళమాంబ దేవాలయం,
అమరాపురం,
శ్రీ సత్యసాయి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
Contact Info
- +91 7816045558
- [email protected]
-
చోళమాంబ దేవాలయం, అమరాపురం,
శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్